

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్ రింగ్స్ తర్వాత కొత్త తరహా వేరబుల్ టెక్నాలజీగా ‘టెంపుల్’ను తీసుకురావాలని జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రయోగాత్మక వెల్నెస్ పరికరంపై ఆసక్తి పెంచుతున్న ఆయన, ‘టెంపుల్’ను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంప్రదాయ ఫిట్‌నెస్ ట్రాకర్లకు భిన్నంగా, వినియోగదారుల ఆరోగ్యం మరియు శారీరక కార్యకలాపాలపై మరింత సమగ్ర సమాచారం అందించేలా దీనిని రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది.
అథ్లెట్ల కోసం రూపొందించిన హై-పెర్ఫార్మెన్స్ వెల్నెస్ ట్రాకర్‌గా ‘టెంపుల్’ను అభివృద్ధి చేశారు. మెదడు, శరీర కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందని, సాధారణ ఫిట్‌నెస్ కొలమానాలకు మించి పనిచేస్తుందని చెబుతున్నారు. తేలికైన డిజైన్‌తో రూపొందించిన ఈ పరికరాన్ని తల కణతల ప్రాంతంలో సౌకర్యవంతంగా ధరించవచ్చు. ఇప్పటికే కొందరు ప్రముఖ అథ్లెట్లు ఈ వేరబుల్‌ను ఉపయోగిస్తూ కనిపించడం దీనిపై మరింత ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!