

టీనేజర్ల వాట్సాప్ వినియోగంపై తల్లిదండ్రులకు మరింత నియంత్రణ కల్పించేలా ‘పేరెంట్ మేనేజ్డ్ అకౌంట్స్’ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. పిల్లల ప్రొఫైల్ ఫొటో ఎవరికి కనిపించాలి, వారు ఏ గ్రూపుల్లో చేరాలి, వారిని ఎవరు గ్రూపుల్లో చేర్చవచ్చు, ఎవరి స్టేటస్లు వారికి కనిపించాలి, వారి స్టేటస్లు ఎవరికి కనిపించాలి వంటి సెట్టింగులను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. అలాగే మెటా ఏఐ వినియోగంపై కూడా నియంత్రణలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కంట్రోల్స్ తప్పనిసరి కావని వాట్సాప్ తెలిపింది.
తల్లిదండ్రులు, పిల్లలు కలిసి సెట్ చేసిన పిన్‌తో ఈ సెట్టింగులను లాక్ చేయవచ్చు. పిల్లలు కొత్త గ్రూపులో చేరినప్పుడు, గ్రూపు నుంచి బయటకు వచ్చినప్పుడు లేదా కొన్ని గ్రూపుల్లో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్లు వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అయితే తల్లిదండ్రులకు చాటింగ్‌ను చదివే, కాల్స్‌ను వినే అవకాశం ఉండదు. వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కొనసాగుతుంది. ఈ ఫీచర్‌ను వివిధ దేశాల్లో దశలవారీగా విడుదల చేస్తున్నామని సంస్థ తెలిపింది. భారత్‌లో ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!