24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం

Writer: Pooja 09:18 AM, 24 సెప్టెంబర్, 2026
మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం

ఎం3ఎం హురున్‌ ఇండియా సంపన్నుల జాబితా 2026 ప్రకారం.. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం మరోసారి దేశంలోనే అత్యంత సంపన్నులుగా నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుటుంబాన్ని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అదానీ కుటుంబ సంపద 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు, అంటే 9,600 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు అంబానీ కుటుంబ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ రెండు కుటుంబాల సంపద మధ్య వ్యత్యాసం రూ.59,400 కోట్లుగా ఉంది.

ఆర్సెలార్‌ మిట్టల్‌కు చెందిన లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ కుటుంబం రూ.3.39 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా కుటుంబం నాలుగో స్థానంలో ఉండగా.. హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్‌ మల్హోత్రా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దిలీప్‌ సంఘ్వీ, విప్రోకు చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వేదాంతకు చెందిన అనిల్‌ అగర్వాల్‌ కుటుంబం రూ.2.08 లక్షల కోట్ల సంపదతో తొమ్మిదో స్థానానికి చేరగా టొరెంట్‌ ఫార్మాకు చెందిన సమీర్‌ మెహతా కుటుంబం పదో స్థానంలో నిలిచింది. గౌతమ్‌ అదానీ 2022లో ముఖేష్ అంబానీని అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నారు. 2023లో ఆ స్థానాన్ని కోల్పోయి, 2024లో తిరిగి దక్కించుకున్నారు. 2025లో మళ్లీ వెనుకబడిన ఆయన తాజాగా మరోసారి అగ్రస్థానాన్ని సాధించారు.

హురున్‌ జాబితాలో కృత్రిమ మేధ తొలిసారిగా ప్రత్యేక రంగంగా చోటు దక్కించుకుంది. ఈ రంగానికి చెందిన 19 మంది మొత్తం రూ.3.07 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. బెంగళూరుకు చెందిన క్యూపీఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజ రూ.1,700 కోట్ల సంపదతో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగం నుంచి జాబితాలో చోటు సంపాదించిన తొలి వ్యక్తిగా నిలిచారు. జాబితాలోని వారిలో 70 శాతం మంది స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలే. ఐదేళ్ల క్రితం ఈ వాటా 55 శాతంగా ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 1,266కు చేరింది. కనీసం రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారి సంఖ్య 128 పెరిగి 1,810కి చేరుకుంది. వీరి మొత్తం సంపద 12.8 శాతం వృద్ధితో రూ.187.5 లక్షల కోట్లకు చేరిందని, ఇది దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగభాగమని హురున్‌ తెలిపింది. ఈ ఏడాది 27 మంది కొత్తగా డాలర్‌ బిలియనీర్లుగా చేరడంతో మొత్తం సంఖ్య 391కి పెరిగింది. ముంబై నుంచి 465 మంది, ఢిల్లీ నుంచి 236 మంది, బెంగళూరు నుంచి 129 మంది జాబితాలో ఉన్నారు. ఇందులో 131 మంది మహిళలు ఉండగా, రోష్ని నాడార్‌ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. జాబితాలోని 156 మంది విదేశాల్లో నివసిస్తున్నారు. వారిలో 90 మంది అమెరికాలో, 31 మంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆఫ్‌రోడ్ ప్రో

భారత్‌లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆఫ్‌రోడ్ ప్రో

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌

మొబైల్ స్క్రీన్ గార్డులపై బీఐఎస్‌ కొత్త రూల్స్‌

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

ట్యాగ్లు
గౌతమ్ అదానీముఖేష్ అంబానీహురున్ సంపన్నుల జాబితాభారతీయ బిలియనీర్లుకృత్రిమ మేధసంపన్న కుటుంబాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు
గాసిప్స్

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం
క్రీడలు

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

డీసీ, ప్యారడైజ్‌ లకు ప్రాణం పోసిన అనిరుధ్?
సినిమాలు

డీసీ, ప్యారడైజ్‌ లకు ప్రాణం పోసిన అనిరుధ్?

యష్ టాక్సిక్ ఓటీటీ రైట్స్‌కు భారీ షాక్.. ధరలో భారీ పతనం
ఓటీటీ

యష్ టాక్సిక్ ఓటీటీ రైట్స్‌కు భారీ షాక్.. ధరలో భారీ పతనం

మహేష్ రికార్డుని సమం చేసిన నాని?
సినిమాలు

మహేష్ రికార్డుని సమం చేసిన నాని?

ప్రిన్స్‌ అజ్మత్‌ జా పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు
జనరల్

ప్రిన్స్‌ అజ్మత్‌ జా పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు

ది ప్యారడైజ్‌పై మిశ్రమ స్పందన.. మాస్ ఎక్కువైందా?
సినిమాలు

ది ప్యారడైజ్‌పై మిశ్రమ స్పందన.. మాస్ ఎక్కువైందా?

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ
జనరల్

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు
జనరల్

ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

విజయవాడ డీఎస్సీ ధర్నా కేసులో పలువురికి బెయిల్
జనరల్

విజయవాడ డీఎస్సీ ధర్నా కేసులో పలువురికి బెయిల్

ప్యారడైజ్‌లో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు.. వీరే!
సినిమాలు

ప్యారడైజ్‌లో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు.. వీరే!

ప్రయత్నం లేకుండానే బరువు తగ్గుతున్నారా? వైద్యులు చెప్పిన హెచ్చరికలు ఇవే!
ఆరోగ్యం

ప్రయత్నం లేకుండానే బరువు తగ్గుతున్నారా? వైద్యులు చెప్పిన హెచ్చరికలు ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!