

భారతి ఎయిర్‌టెల్ తన తదుపరి వృద్ధి కోసం ఆర్థిక సేవలు, డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కంపెనీ తాజా వార్షిక నివేదికలో చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్‌బీఐ ఇప్పటికే ఎయిర్‌టెల్ మనీని డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తించిందని, అలాగే అవసరమైన నిధులతో దాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో 'నెక్స్‌ట్రా' బ్రాండ్ కింద 1,000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
డిజిటలైజేషన్, క్లౌడ్ సేవల వినియోగం, డేటా లోకలైజేషన్ కారణంగా ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని మిట్టల్ పేర్కొన్నారు. క్లౌడ్ సేవల కోసం ఇప్పటికే 24 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడులు రూ.18 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. గత పదేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం ఎయిర్‌టెల్ రూ.3.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగా, సంస్థ 5జీ వినియోగదారుల సంఖ్య 18.8 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!