
జనరల్

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను మరింత పటిష్ఠం చేసుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏడాదికి ఒక్కసారి ఉపయోగించినా హెచ్‌ఐవీ సోకకుండా అడ్డుకునే లెనాకెపావిర్ ఔషధాన్ని తయారు చేసేందుకు అంతర్జాతీయ ఫార్మా సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గిలీడ్ అభివృద్ధి చేసిన ఈ ఔషధం ప్రస్తుతం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం గిలీడ్‌కు రాయల్టీ చెల్లించకుండా, నాన్-ఎక్స్‌క్లూజివ్ విధానంలో డాక్టర్ రెడ్డీస్ లెనాకెపావిర్‌ను తయారు చేసి 120కిపైగా తక్కువ ఆదాయ దేశాల్లో మార్కెట్ చేయనుంది. ఇప్పటికే ఏడాదికి రెండుసార్లు తీసుకునే లెనాకెపావిర్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ తయారు చేసి మార్కెట్ చేస్తోంది. కొత్త ఒప్పందంతో హెచ్‌ఐవీ నివారణకు ఉపయోగపడే ఔషధాల లభ్యతను మరింత విస్తరించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!