

భారత పేసర్ ఖలీల్ అహ్మద్ మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టులోకి చేరనున్నాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్ ఖలీల్‌ను రూ.4.8 కోట్లకు, నాథన్ ఎలిస్‌ను రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇందుకు బదులుగా లియామ్ లివింగ్‌స్టన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను సీఎస్‌కేకు అప్పగించింది. ఖలీల్ గతంలో 2018 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన జట్టుకు తిరిగి చేరనున్నాడు.
ఎస్‌ఆర్‌హెచ్ వేలంలో లియామ్ లివింగ్‌స్టన్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేయగా, ట్రేడింగ్ ఒప్పందం ప్రకారం సీఎస్‌కే అతడికి రూ.6 కోట్లు చెల్లించనుంది. జాక్ ఎడ్వర్డ్స్‌కు మాత్రం గతంలో ఉన్న రూ.3 కోట్ల ధరనే కొనసాగించనుంది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీసినప్పటికీ ఖలీల్‌ను ఆ జట్టు వదులుకోవడం గమనార్హం. ఆటగాళ్ల ట్రేడింగ్ గడువు ఈ నెల 17తో ముగియనుంది. మరోవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా ఈ ట్రేడింగ్‌పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!