

పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో భారత్–గల్ఫ్ దేశాల మధ్య విమాన సర్వీసులు మళ్లీ వేగం అందుకుంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల అనంతరం, పాకిస్థాన్ గగనతల పరిమితుల కారణంగా గత కొన్ని నెలలుగా విమానయాన సంస్థలు సర్వీసులను తగ్గించడం, రీ-రూటింగ్ చేయడం, కొన్ని విమానాలను రద్దు చేయడం జరిగింది. దీంతో జనవరిలో 9,793గా ఉన్న భారత్–పశ్చిమాసియా విమానాల సంఖ్య ఏప్రిల్‌లో 5,552కు పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో జులై నాటికి షెడ్యూల్ చేసిన విమానాల సంఖ్య 9,474కు చేరుకుంది. దుబాయ్, దోహా, అబుధాబి, మస్కట్ వంటి ప్రధాన హబ్‌లకు సేవలు వేగంగా పునరుద్ధరించబడుతున్నాయి.
యుద్ధ ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై ఎక్కువగా పడినప్పటికీ, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి సంస్థలు క్రమంగా తమ సేవలను పెంచుతున్నాయి. ఎయిరిండియా మాత్రం భద్రతా చర్యల కారణంగా ఇంకా పరిమిత సర్వీసులతో కొనసాగుతోంది. విమానాశ్రయాల పూర్తి సామర్థ్యం పునరుద్ధరించడానికి మరో 5 నుంచి 8 వారాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విమాన ఇంధన ధరలు స్థిరంగా ఉంటే, అంతర్జాతీయ విమాన ఛార్జీలు కూడా రానున్న వారాల్లో క్రమంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!