

చెన్నైలోని ఓ జువెలరీ దుకాణంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించగా.. హాల్‌మార్క్ లేని 804 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాల విక్రయంపై నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం కొనుగోలు చేసే సమయంలో నగపై ఉన్న హాల్‌మార్క్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఆభరణం స్వచ్ఛతపై స్పష్టత పొందవచ్చు.
బంగారు ఆభరణంపై ప్రధానంగా BIS స్టాండర్డ్ మార్క్, స్వచ్ఛత గ్రేడ్, HUID నంబర్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. 22K916 అంటే సుమారు 91.6 శాతం, 18K750 అంటే 75 శాతం, 14K585 అంటే 58.5 శాతం బంగారం ఉన్నట్లు అర్థం. ప్రతి హాల్‌మార్క్ ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే ఆరు అక్షరాలు/అంకెల HUID నంబర్‌ను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. BIS Care యాప్‌లో ‘Verify HUID’ ఆప్షన్ ద్వారా ఈ కోడ్‌ను నమోదు చేస్తే ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్కింగ్, స్వచ్ఛత, అసేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వివరాలను దుకాణదారుడు ఇచ్చే బిల్లుతో సరిపోల్చుకున్న తర్వాతే కొనుగోలు చేయడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!