

ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2026కు ఆగస్టు 17న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టం పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, ఆదాయపు పన్ను చట్టం, ఫైనాన్స్ యాక్ట్‌లలో మార్పులు చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఎండీఆర్ అమలు చేయలేదు, రేట్లను కూడా నిర్ణయించలేదు. వినియోగదారులు, చిన్న వ్యాపారాలకు యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఎండీఆర్ అమలు చేసినా కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకే పరిమితం చేసే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కూడా ఈ సవరణతో భారీ ప్రయోజనం కలగనుంది. పన్ను ప్రోత్సాహకాల కాలాన్ని FY2030-31 నుంచి FY2040-41 వరకు పొడిగించారు. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్లు, సర్వర్లు, వేరబుల్స్, హియరబుల్స్ తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఈ ప్రయోజన పరిధిలోకి వస్తాయి. మరోవైపు అక్టోబర్ 1, 2026 నుంచి రఫ్ డైమండ్ వ్యాపారానికి పన్ను ఉపశమనం అందించనున్నారు. దీంతో ఎలక్ట్రానిక్స్, వజ్రాల రంగాలకు గణనీయమైన ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!