
బిజినెస్

బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మే 13 నుంచి ఆగస్టు 2 వరకు ఈ విలువైన లోహాల దిగుమతులపై కేంద్రానికి రూ.10,463 కోట్ల కస్టమ్స్ ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధాన వాటా బంగారం దిగుమతులదే. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరగడంతో దిగుమతుల విలువ కూడా గణనీయంగా పెరిగింది.
అయితే, గత మూడు నెలల్లో బంగారం దిగుమతుల పరిమాణం పెద్దగా పెరగలేదని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, దిగుమతులపై సుంకం పెంచడం వల్లే ఈ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో అధికారులు 161 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల విలువ సుమారు 71.97 బిలియన్ డాలర్లుగా నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!