
ఓటీటీ

ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటా విక్రయ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ వాటా కొనుగోలు కోసం ప్రేమ్ వత్స నాయకత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్స్, దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ ఎన్‌డీబీ సమర్పించిన ఆర్థిక బిడ్లను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు ఈ రెండు సంస్థలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే అనుమతులు ఇచ్చాయి.
ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్స్, ఎమిరేట్స్ ఎన్‌డీబీ బిడ్లు దాఖలు చేయడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీకి కలిపి 94.71 శాతం వాటా ఉంది. ఆర్థిక బిడ్ల పరిశీలన అనంతరం వాటా విక్రయ ప్రక్రియలో తదుపరి దశపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!