

భారత వస్తు ఎగుమతులు జూలైలో వార్షిక ప్రాతిపదికన 19.63 శాతం వృద్ధి చెంది 4,424 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.22 లక్షల కోట్లు) చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత ఇదే అత్యధిక వృద్ధి. అయితే దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు ఆరు నెలల గరిష్ఠ స్థాయి 3,198 కోట్ల డాలర్లకు చేరింది. జూలైలో దిగుమతులు 17.52 శాతం పెరిగి 7,622 కోట్ల డాలర్లకు చేరగా, ముడిచమురు దిగుమతులు 17.64 శాతం పెరిగి 1,831 కోట్ల డాలర్లకు చేరడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ జూలైలో పశ్చిమాసియా దేశాలకు భారత్ ఎగుమతులు 8.62 శాతం పెరిగి 570 కోట్ల డాలర్లకు చేరాయి. యూఏఈకి ఎగుమతులు 10.15 శాతం పెరగగా, సౌదీ అరేబియాకు 2.73 శాతం తగ్గాయి. అమెరికాకు ఎగుమతులు 12.85 శాతం, చైనాకు 64.57 శాతం పెరిగాయి. మరోవైపు, కస్టమ్స్ సుంకాల పెంపు ప్రభావంతో బంగారం దిగుమతులు స్వల్పంగా పెరగగా, వెండి దిగుమతులు 66.1 శాతం భారీగా తగ్గాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!