

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యేక అతిథిగా సందడి చేశాడు. లండన్‌లోని సెంటర్ కోర్టులో ఉన్న రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి టెండూల్కర్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వింబుల్డన్ రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న నాలుగో భారత క్రికెట్ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సచిన్‌ను వింబుల్డన్ నిర్వాహకులు "క్రికెట్ రాయల్టీ"గా సత్కరించడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా రాయల్ బాక్స్‌లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.
ఇటీవల శుభ్‌మన్ గిల్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా సిల్వర్‌స్టోన్‌లో జరిగిన ఫార్ములా-1 రేసును కూడా ప్రత్యేక అతిథిగా వీక్షించాడు. ప్యాడక్‌ను సందర్శించి రేసింగ్ ప్రపంచ ప్రముఖులతో ముచ్చటించాడు. ఇదిలా ఉండగా, సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే వింబుల్డన్‌లో సచిన్ పక్కన గిల్ కనిపించడంతో ఆ పుకార్లు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!