

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల తర్వాత బలంగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 443.97 పాయింట్లు లాభపడి 76,922.64 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 140.10 పాయింట్లు పెరిగి 24,005.85 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.39 లక్షల కోట్లు పెరిగి రూ.476.48 లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,140.50 కోట్ల విలువైన షేర్లు విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.3,159.24 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
సెన్సెక్స్‌లో ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకీ, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, కేపీఐటీ టెక్నాలజీస్ షేరు 16.98 శాతం పతనమైంది. అద్విత్ జువెల్స్ షేరు స్టాక్ మార్కెట్లో బలమైన ఆరంభం చేయగా, వాటర్‌వేస్ లీజర్ టూరిజం షేరు తొలి రోజే నిరాశపరిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!