
రాజకీయాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు, ముడి చమురు ధరల్లో స్థిరీకరణ వంటి పరిణామాలతో ఇన్వెస్టర్లలో సానుకూలత పెరిగింది. దీంతో సెన్సెక్స్ 299.17 పాయింట్లు లేదా 0.40 శాతం లాభపడి 74,828.25 వద్ద ముగియగా.. నిఫ్టీ 117.80 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగి 23,446.80 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.7 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.9 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ 2.4 శాతం లాభంతో ముందంజలో ఉండగా.. ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా మంచి పనితీరు కనబరిచాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సుమారు 0.8 శాతం క్షీణించి వెనుకబడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!