

భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలకు విరుద్ధమైన లేబులింగ్, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఆహార ఉత్పత్తులపై తప్పుడు సమాచారం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలకు 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో నెస్లే ఇండియా, పెప్సికో, కోకా-కోలా ఇండియా, అబాట్ ఇండియా, మాండెలెజ్ ఇండియా, ఫెర్రెరో ఇండియా, డానోన్ ఇండియా, కెన్వ్యూ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఎనర్జీ డ్రింక్ సంస్థలు రెడ్ బుల్ ఇండియా, మాన్‌స్టర్ ఎనర్జీ, హెల్ ఎనర్జీతో పాటు డియాజియో, పెర్నాడ్ రికార్డ్ వంటి ఆల్కహాలిక్ పానీయాల సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కలిపి 12 నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అమెజాన్‌కు చెందిన ఒక వేర్‌హౌస్ లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. అలాగే కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్, కోస్టా కాఫీ వంటి ఫాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్ చైన్‌లకు 30కి పైగా నోటీసులు ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా డొమినోస్‌కు చెందిన ఐదు లైసెన్స్‌లను కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రద్దు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!