

మాస్ మహారాజా రవితేజ తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సినిమాలో రవితేజ కొత్త అవతారం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన సుమారు 40 గంటల్లోనే పలు ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ సాధించినట్లు సమాచారం. ప్రస్తుత థియేట్రికల్ మార్కెట్ పరిస్థితుల్లో ఇది మంచి విజయంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం మిడ్‌నైట్ షోలు సైతం పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ అవుతున్నట్లు సమాచారం. తొలి రోజు ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్, భారీ డిమాండ్ కారణంగా రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో రూ.150–200 కోట్ల లైఫ్‌టైమ్ గ్రాస్ సాధించి, రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద థియేట్రికల్ విజయంగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!