

బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన 2026 భారత టాప్ 100 అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో టాటా గ్రూప్ వరుసగా 10వ ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే టాటా బ్రాండ్ విలువ 7 శాతం పెరిగి 3360 కోట్ల డాలర్లకు చేరింది. ఇన్ఫోసిస్ వరుసగా ఐదో ఏడాది రెండో స్థానంలో నిలవగా, ఎల్ఐసీ 12 శాతం వృద్ధితో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
హెచ్డీఎఫ్సీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అనంతరం ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, అదానీ గ్రూప్, ఎల్ అండ్ టీ, ఎయిర్టెల్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలోని టాప్ 100 బ్రాండ్ల మొత్తం విలువ 25280 కోట్ల డాలర్లకు చేరి, ఏడాది ప్రాతిపదికన 7 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఈ ఏడాది 114 శాతం బ్రాండ్ విలువ పెరుగుదలతో సుజ్లాన్ ఎనర్జీ అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా నిలిచింది. తాజ్ హోటల్స్ వరుసగా ఐదో ఏడాది దేశంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా నిలవగా, జొమాటో, అమూల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే టీసీఎస్ వరుసగా 14వ ఏడాది అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!