
జనరల్

ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమపై నౌకాదళ దిగ్బంధనం విధించడం ద్వారా ఒప్పంద స్ఫూర్తిని దెబ్బతీశారని అమెరికాపై ఆరోపణలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఒప్పందాన్ని కొనసాగించే అవసరం లేదని, ఇకపై చర్చల ప్రస్తావన తీసుకురాబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికా తన చర్యలను ఇదే విధంగా కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. అవసరమైతే గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి చమురు, సహజ వాయువు ఎగుమతులను స్తంభింపజేసే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!