

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సీఈఓ ఒలివర్ బ్లూమ్ నేతృత్వంలో రూపొందుతున్న ప్రణాళికలో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు, కొన్ని ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడుల తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. సంస్థ ఆర్థిక ఒత్తిడిని తగ్గించి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ చర్యల లక్ష్యంగా భావిస్తున్నారు.
ఈ ప్రణాళిక ప్రకారం దాదాపు లక్ష మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 15 శాతానికి సమానమని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే 50 వేల ఉద్యోగాల కోతకు అంతర్గత ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. అలాగే వచ్చే ఐదేళ్లలో పెట్టుబడులను సుమారు 15 శాతం తగ్గించి మొత్తం 130 బిలియన్ యూరోలకు పరిమితం చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!