31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

Writer: Chandrika 07:28 PM, 31 ఆగస్టు, 2026
చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగాయి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల రమాబాయి రణ్‌వీర్‌ తన పట్టుదలతో అందరి మనసులు గెలుచుకున్నారు. సాధారణ చీర, మామూలు స్లిప్పర్లతోనే మారథాన్‌లో పాల్గొని ఏకంగా విజేతగా నిలిచారు. అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ఓ విద్యా ప్రాంగణంలో ‘అమృత్‌ దౌడ్‌’ పేరుతో నిర్వహించిన మారథాన్‌లో ఆమె పాల్గొన్నారు. స్పోర్ట్స్‌ దుస్తులు, షూలతో వచ్చిన యువత మధ్య ఆమె సాధారణ వస్త్రధారణతోనే బరిలోకి దిగారు.

కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన రమాబాయి.. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెల బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం వంటమనిషిగా పనిచేస్తున్నారు. మారథాన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె స్లిప్పర్లు తెగిపోయాయి. అయినప్పటికీ ఆమె పరుగు ఆపలేదు. తెగిన చెప్పులను చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. రాళ్లు గుచ్చుకున్నా, పరుగు సమయంలో చీర ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గలేదు. చివరకు మిగతా పోటీదారులను అధిగమించి మారథాన్‌లో విజయం సాధించి రూ.3,000 నగదు బహుమతిని అందుకున్నారు. ఈ మొత్తాన్ని తన కుమార్తె ఫీజు కోసం ఉపయోగిస్తానని రమాబాయి తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చూపిన పట్టుదల, మాతృప్రేమ పలువురికి స్ఫూర్తిగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు
ట్యాగ్లు
రమాబాయి రణ్‌వీర్మహారాష్ట్రబీడ్అంబాజోగాయిమారథాన్అమృత్ దౌడ్తల్లిమహిళా స్ఫూర్తివిద్యస్ఫూర్తిదాయక కథమాతృప్రేమ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...
రాజకీయాలు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు
రాజకీయాలు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..
జనరల్

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...
జనరల్

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి
జనరల్

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి
జనరల్

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి
రాజకీయాలు

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం
బిజినెస్

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్
టెక్నాలజీ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్