
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ మాతృభూమిపై తనకున్న అపారమైన ప్రేమతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన ఆమె.. ఇప్పుడు తన జీవితంలోని చివరి రోజులను పుట్టిన నేలపైనే గడపాలని నిర్ణయించుకున్నారు. తన చివరి శ్వాస భారతదేశంలోనే విడవాలని, అంత్యక్రియలు కూడా స్వగ్రామంలోనే జరగాలని ఆమె భావోద్వేగంగా తెలిపారు.
భారత పౌరసత్వ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మహాలక్ష్మమ్మ జిల్లా కలెక్టర్‌ను కోరారు. "చచ్చినా నా మట్టిలోనే చావాలి" అనే ఆమె మాటలు దేశభక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఆమె విజ్ఞప్తికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆమె మాతృభూమిపై ఉన్న ప్రేమను ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!