

అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి ఆయనకు సాదర స్వాగతం తెలిపారు.
భట్టి విక్రమార్కకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి డిప్యూటీ సీఎంకు గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. కార్యకర్తల నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారగా, భట్టి విక్రమార్క అందరికీ అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!