

నిషేధిత జాబితా (22A)లో ఉన్న భూముల హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్ల వారీగా బై-నంబర్లు కేటాయించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబును సీఎం ఆదేశించారు. పేదలకు ఉచిత స్థలంతో ఇళ్లు నిర్మిస్తున్నామని, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వం రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు నిరంతరం పనిచేస్తానని సీఎం అన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!