

సాధారణంగా అందాల పోటీలు, డ్యాన్స్ పోటీలు చూస్తుంటాం. కానీ, ఎన్విడియా వివాదం నేపథ్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వింత పోటీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘చైనీస్ స్పై లుక్‌అలైక్ కాంటెస్ట్’ పేరుతో నిర్వహించిన ఈ పోటీలో చైనీస్ గూఢచారుల్లా ఎవరు బాగా కనిపిస్తారనే అంశంపై పోటీ పెట్టారు. ఇది సినిమా షూటింగ్ కోసం నిర్వహించిన ఆడిషన్ కాదు.. నిజంగానే జరిగిన పోటీ. ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ చుట్టూ వినిపిస్తున్న గూఢచర్యానికి సంబంధించిన కథనాలు, ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆసక్తికరంగా మారింది.
న్యూయార్క్‌లోని వాషింగ్టన్ స్క్వేర్ పార్క్‌లో నవంబర్ 21న ఈ పోటీ నిర్వహించారు. ఇందులో పలువురు మహిళలు స్పై గెటప్పులతో వచ్చి తమ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మరో వ్యక్తి జెన్సన్ హువాంగ్‌లా వేషధారణతో కనిపించాడు. పోటీలో పాల్గొన్నవారు రహస్య పత్రాలను దొంగిలిస్తున్నట్లు నటించడం, గూఢచారుల తరహాలో హావభావాలు పలికించడం వంటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విజేతను ఎంపిక చేసేందుకు నిర్వాహకులు క్యూఆర్ కోడ్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. గెలిచిన వారికి 50 డాలర్లు (సుమారు రూ.4,600) బహుమతిగా ప్రకటించారు. ఈ పోటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఈ పోటీని వినోదంగా భావిస్తుండగా, మరికొందరు కుటుంబ వివాదాన్ని, గూఢచర్య ఆరోపణలను ఇలా వినోదంగా మార్చడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!