
ఓటీటీ

అదనపు పన్నుల వాటా కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్లను కేటాయించడం రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమని ఆయన పేర్కొన్నారు.
ఈ అదనపు నిధులు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం ఇస్తాయని, కీలక ప్రాజెక్టుల అమలు వేగవంతం అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!