
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా) పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం ప్రకటించింది. ఒక్కో బార్న్‌కు రూ.50 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతుల పని మూలధన అవసరాలను తీర్చడంతో పాటు మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించడమే ఈ నిర్ణయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం పేర్కొంది. వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గడంతో రైతులకు ఆర్థికంగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు కలిసి పలు చర్యలపై చర్చిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!