
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న ఈ ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24 వరకు విమాన సర్వీసుల షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్-భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు నడపనున్నారు. ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన ఐదు రోజులు అదనంగా మూడో సర్వీసును కూడా నడపనున్నారు. విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!