

ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, చైనా వ్యాపారవేత్త అలిస్ హువాంగ్‌తో ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చిన సంబంధం చుట్టూ మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. అలిస్‌ను జెన్సన్‌కు పరిచయం చేసింది ఆమె భర్త, చైనా వ్యాపారవేత్త కాంగ్ వీనేనని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా కథనం వెల్లడించింది. వ్యాపార సంబంధాల ద్వారా కాంగ్‌కు జెన్సన్‌తో దాదాపు పదేళ్ల పరిచయం ఉన్నట్లు తెలిపింది. ఈ జంటకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ.. తన భార్యకు జెన్సన్‌తో సంబంధం ఉన్న విషయం తెలిసినప్పటికీ కాంగ్ సుమారు రెండేళ్లపాటు మౌనంగా ఉన్నారని కథనం పేర్కొంది. సహచరులతో మాట్లాడేటప్పుడు అలిస్‌ను జెన్సన్‌కు ‘పర్సనల్ అసిస్టెంట్’గా సరదాగా పరిచయం చేసేవారని, వారిద్దరి సాన్నిహిత్యం గురించి బహిరంగంగానే మాట్లాడేవారని తెలిపింది. అలిస్, కాంగ్ కలిసి కొన్నేళ్లలో వివిధ వ్యాపార భాగస్వామ్యాల ద్వారా విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నారని కూడా కథనం పేర్కొంది.
మరోవైపు, ఎన్‌విడియా సాంకేతికతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందేందుకు అలిస్‌ను చైనా నిఘా వర్గాలు ఉపయోగించుకున్నాయనే ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్ర చర్చకు దారితీశాయి. అలిస్‌కు సంబంధం ఉన్న మెగాస్పీడ్ సంస్థ ద్వారా ఎగుమతి ఆంక్షలు ఉన్న ఎన్‌విడియా చిప్‌లు చైనాకు చేరాయా అనే అంశంపై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు జరిపినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే, అలిస్ చైనా గూఢచారిగా పనిచేశారనే ఆరోపణలు ఇప్పటివరకు బహిరంగంగా నిర్ధారణ కాలేదు. చైనా కూడా గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలను ఖండించింది. ఇదిలా ఉండగా, అలిస్ తిరిగి చైనాకు వెళ్లి ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది. జెన్సన్ హువాంగ్ తన భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని అంగీకరించగా, జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణలపై ఎన్‌విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!