

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో భారత్ సమ్మిట్-2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. మొత్తం 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న పలు అంశాలపై చర్చలు, విజ్ఞాన పంపిణీ, ఆలోచనల మార్పిడికి ఈ సదస్సు వేదిక కానుంది. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైజింగ్ థీమ్‌తో ప్రత్యేక సెషన్లను కూడా నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను ఈ సెషన్లలో ప్రస్తావించనున్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు సమ్మిట్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. రెండో రోజు ఆయన పాల్గొనడం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖుల భాగస్వామ్యంతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందనుంది. తెలంగాణ అభివృద్ధి దార్శనికతను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు ఈ సదస్సు అవకాశం కల్పించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!