
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆరోగ్యశాఖ మంత్రి డా. అరుణ్‌రాజ్, ఉన్నతాధికారులతో కలిసి వివిధ వార్డులను సందర్శించిన ఆయన, కొత్త తల్లులతో మాట్లాడి చికిత్స, మందుల అందుబాటు, పరిశుభ్రత, ఆస్పత్రి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై మాతా-శిశు ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగులకు నాణ్యమైన, పారదర్శకమైన, అవినీతి రహిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, లంచాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ ఆకస్మిక తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. రోగులు, చిన్నారులతో విజయ్ మమేకమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!