
జనరల్

అమరావతిలో నేడు సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు హాజరుకానుండగా, డిప్యూటీ సీఎం మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం.
పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రాబోయే రాజకీయ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి, కేడర్ బలోపేతం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రాధాన్యంగా చర్చకు వచ్చే అవకాశముంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!