

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖతో పాటు పలు అనుబంధ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్, ఫైర్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్, పోలీస్ కమ్యూనికేషన్స్, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగాల్లో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టుల్లో 438 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉండగా, సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. అలాగే సివిల్, ఏఆర్, ఫైర్, ప్రిజన్స్ విభాగాల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఫైర్‌మెన్, వార్డర్, కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్, PTO డ్రైవర్, మెకానిక్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక AP SLPRB వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!