

యాపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్‌కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి సమర్పించిన వివరాల ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరానికి టెర్నస్ లక్ష్య పరిహారం సుమారు 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు)గా ఉంది. ఇందులో 3 మిలియన్ డాలర్ల వార్షిక మూల వేతనంతో పాటు 55 మిలియన్ డాలర్ల విలువైన వార్షిక ఈక్విటీ అవార్డు ఉంటుంది. ఈ ఈక్విటీలో 75 శాతం యాపిల్ షేరు పనితీరుపై, మిగతా 25 శాతం కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది.
మరోవైపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మారిన టిమ్ కుక్‌కు 2027 ఆర్థిక సంవత్సరానికి 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం, 45 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ అవార్డు కలిపి సుమారు 47 మిలియన్ డాలర్ల ప్యాకేజీ లభించనుంది. టెర్నస్ సెప్టెంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2001లో యాపిల్‌లో చేరిన ఆయన.. గతంలో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!