

గ్రామీణ నేపథ్యం, సంప్రదాయాలు, జానపద నమ్మకాలు, వ్యక్తిగత ఆశయాల మధ్య సాగే ఇంటెన్స్ కథాంశంతో రూపొందిన ‘మారెమ్మ’ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. “ప్రతి ఊరి పుట్టుకకు ఒక సాంప్రదాయం ఉంటుంది” అనే డైలాగ్‌తో కథలోని భావోద్వేగ గాఢతను పరిచయం చేశారు. చదువుకున్న యువకుడు మాధవ్, ఊరి పవిత్రమైన ఆచారాన్ని, అమ్మవారిపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకు తన ఆశయాలను పక్కనపెట్టి చేసే పోరాటాన్ని రస్టిక్ అండ్ రియలిస్టిక్ టోన్‌లో చూపించారు.

ఊరి పరువును దెబ్బతీయాలని ప్రయత్నించే శక్తులకు, “ఈ ఊరిని కాపాడేది మారెమ్మ తల్లే” అంటూ ఎదిరించే హీరోకు మధ్య సాగే ఘర్షణలు ట్రైలర్‌లో ఉత్కంఠను పెంచాయి. మాధవ్ రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకోగా, ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక ఎలివేషన్‌గా నిలిచింది. “ఈ భూమి మీద ఓ జీవి బతకాలంటే మరో జీవి సావాల్సిందే” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ముగిసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. గ్రామీణ డ్రామా, ఎమోషన్స్, యాక్షన్‌తో తెరకెక్కిన ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!