
క్రీడలు

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలుగు భాష తెలియని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు పరిచయ కోర్సును నిర్వహించనున్నారు. తెలుగు అకాడమీ బోధన కార్యక్రమం కింద ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కోర్సు తరగతులు అక్టోబరు 5వ తేదీ నుంచి 48 పని రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెల్లడించారు. కోర్సుకు సంబంధించిన ఇతర వివరాల కోసం 040-23226041, 040-23225215 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!