

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న బీహార్‌కు చెందిన నందులాల్‌ను సందీప్ కారు ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదాన్ని గమనించిన విద్యార్థి జైద్ షా ఖాద్రీ గాయపడిన నందులాల్‌ను ఆసుపత్రికి తరలించేందుకు తన కారులో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో మహీంద్రా కారు వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నందులాల్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన రెండో వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో రెండు వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ సాయిని విచారించిన అనంతరం ఆయన కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!