

హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ల కోసం రూపొందించిన కొత్త లోగోలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. పరిశుభ్రత, పచ్చదనం, సుస్థిర అభివృద్ధి, మెరుగైన పౌర సేవలు, సమర్థవంతమైన నగర పాలన అనే ప్రధాన అంశాలను ప్రతిబింబించేలా ఈ లోగోలను రూపొందించారు. మూడు లోగోల్లోనూ ఆకుపచ్చ రంగు పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి, నీలం రంగు విశ్వాసం, బాధ్యత, పారదర్శక పాలనకు ప్రతీకగా నిలుస్తుంది.

జీహెచ్ఎంసీ లోగో పచ్చని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన హైదరాబాద్ లక్ష్యాన్ని చాటుతుండగా, సైబరాబాద్ లోగో స్మార్ట్ మౌలిక వసతులు, మెరుగైన పౌర సేవలు, పర్యావరణహిత అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. మల్కాజిగిరి లోగో ప్రకృతి, ప్రజలు, అభివృద్ధి అనే మూడు ప్రధాన భావాలకు ప్రతీకగా రూపొందించారు. ఆకుపచ్చ ఆకులు పచ్చదనం, ఆరోగ్యకరమైన భవిష్యత్తును సూచిస్తుండగా, నీటి బొట్టు నీటి సంరక్షణ, స్వచ్ఛత, కీలక పౌర సేవలను తెలియజేస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!