

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జూలై 20 నుంచి 25 వరకు జరిగిన విద్యార్థి నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తులకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. దేశవ్యాప్తంగా ఈ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు చేసిన హామీల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదని కూడా హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు అనంతరం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పరిహారం అందించే విధివిధానాలను రూపొందించేందుకు మూడు నెలల సమయం కోరగా, ఆ వ్యవస్థను మూడు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో సీజేపీ సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన నిరసన మార్చ్‌ను విరమించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!