
జనరల్

‘ఒక్కసారి సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్టు చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో ఒక్కొక్కరి వద్ద సబ్‌స్క్రైబ్ చేయించుకున్నందుకు ఒక్కో తిరుమల లడ్డూ ఇస్తున్నట్లు చూపించారు. మొత్తం 30 మంది వద్ద సబ్‌స్క్రైబ్ చేయించుకుని 30 లడ్డూలు పొందినట్లు అందులో పేర్కొన్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో తిరుమల లడ్డూలను సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగించడంపై చర్చ మొదలైంది. అయితే వీడియోలో చూపించిన ఘటన నిజంగానే జరిగిందా? సబ్‌స్క్రైబ్‌లకు లడ్డూలు ఎలా, ఎవరి ద్వారా అందించారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!