
క్రీడలు

అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన రూ.5 కోట్ల విలువైన బంగారు పూత రామచరితమానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలను అయోధ్య రామాలయ ట్రస్ట్ ఖండించింది. ఈ ఆరోపణలకు తెరదించేందుకు ట్రస్ట్ ఆ పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించింది. పుస్తకం సురక్షితంగానే ఉందని, దానిపై వస్తున్న ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
దేవాలయానికి విరాళంగా వచ్చే ప్రతి వస్తువును అధికారిక రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నామని ట్రస్ట్ వెల్లడించింది. అవసరమైతే భక్తులు స్వయంగా వచ్చి వివరాలను పరిశీలించవచ్చని పేర్కొంది. ఆలయానికి వచ్చే ప్రతి కానుకను పూర్తి పారదర్శకతతో భద్రపరుస్తున్నామని, బంగారు పూత రామచరితమానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ట్రస్ట్ స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!