
జనరల్

‘పెద్ది’ సినిమా విడుదలై నెల రోజులు పూర్తవడంతో తెలంగాణలో పర్సంటేజ్ విధానం అమలుపై ఎగ్జిబిటర్ల మధ్య మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంపై కొందరు ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సినీ వర్గాల్లో సమాచారం. దీనిపై స్పందించిన చిరంజీవి, తుది నిర్ణయానికి ముందు తనకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు, యాక్టివ్ నిర్మాతలు మాత్రం పర్సంటేజ్ విధానం అమలును కనీసం ఏడాదిన్నర పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలా లేదా థియేటర్ల అద్దెలను పెంచాలా అనే అంశాలపై చర్చిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!