
క్రీడలు

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్‌ను తెలంగాణలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు.
హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా బండి సంజయ్ హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశభక్తి స్ఫూర్తితో ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా బీజేపీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!