
సినిమాలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సంస్థ విస్తరణకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు. కొత్తగూడెంలో సింగరేణి, జెన్‌కో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
భవిష్యత్తులో ఇంధన రంగంలో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా సోలార్, పంప్డ్ స్టోరేజ్, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్, రేర్ ఎర్త్ మినరల్స్, బ్యాటరీ స్టోరేజ్ వంటి కొత్త రంగాల్లోకి విస్తరించాలని సూచించారు. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాలంటే నాణ్యత పెంచి, నిర్వహణ వ్యయాన్ని తగ్గించి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!