

అమరావతిలో విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి నారా లోకేశ్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని, బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల భవనాలు పటిష్టంగా ఉండటంతో పాటు నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను వివిధ పరిశ్రమలతో అనుసంధానిస్తూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తున్నామని లోకేశ్ తెలిపారు. నైపుణ్యం వెబ్ పోర్టల్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు నైపుణ్యాభివృద్ధి సాధనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై కూడా విద్యాశాఖ దృష్టి సారించిందన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయం రక్షణపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, పాఠ్యప్రణాళికలో మార్పుల కోసం రోడ్‌మ్యాప్ రూపొందించుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!