

భారత్ ఆతిథ్యం ఇస్తున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి న్యూఢిల్లీ సిద్ధమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సహా పలువురు దేశాధినేతలు, దౌత్యవేత్తలు, వీవీఐపీలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ ఉపయోగించే ‘ఆరస్ సెనాట్ లిమోసిన్’ ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పుతిన్ తన అధికారిక కారును ప్రత్యేక విమానంలో ముందుగానే అక్కడికి తరలిస్తారు. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకునేలా రూపొందించిన ఈ వాహనం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలతో కూడిన నడిచే రక్షణ కోటగా పేరొందింది.
ఆరస్ సెనాట్‌ను రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్, ప్రభుత్వ పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో కార్టెజ్ ప్రాజెక్టులో అభివృద్ధి చేసింది. 4.4 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజిన్, హైబ్రిడ్ వ్యవస్థతో కలిపి 598 హార్స్‌పవర్, 880 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 0-100 కి.మీ. వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలతో పాటు లోపల హై-ఎండ్ లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక వినోద వ్యవస్థలు ఉన్నాయి. సాధారణ వినియోగదారుల కోసం కూడా దీని వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పత్తి పరిమితంగానే ఉంటుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!