

అమెరికాలో ఒక సూపర్మార్కెట్లో బెండకాయతో తయారు చేసిన స్నాక్ ధరపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ఆశిష్ అహూజా ఈ వీడియోను షేర్ చేశారు. అందులో 85 గ్రాముల క్రిస్పీ బెండకాయ ప్యాకెట్ ధర $6.50గా చూపించారు. భారత కరెన్సీ ప్రకారం లెక్కిస్తే కిలోకు సుమారు ₹7,200 అవుతుందని ఆయన తెలిపాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోలో భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే బెండకాయను అమెరికాలో ప్రీమియం స్నాక్‌గా విక్రయించడం ఆసక్తికరంగా ఉందని ఆశిష్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోతో ఇండియా-అమెరికా ధరల మధ్య తేడాలపై చర్చలు మొదలయ్యాయి. కొందరు ఇది ప్రాసెస్డ్ ఫుడ్ అని చెప్పగా, మరికొందరు అదే డబ్బుతో భారత్‌లో ఫ్రిజ్ నిండా కూరగాయలు కొనుగోలు చేయవచ్చని సరదాగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!