

అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సరైన కారణాలు ఏవీ లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ కక్షసాధింపుతోనే కేసు నమోదు చేశారన్న హైకోర్టు వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, ప్రభుత్వ ఉత్తర్వుల జారీ వంటివి పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని పేర్కొంది. బాధిత వ్యక్తులు ఎవరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించని పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లకు చట్టబద్ధత ఉండదన్న హైకోర్టు అభిప్రాయాన్ని సమర్థించింది. న్యాయస్థానాలను రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చవద్దని సూచిస్తూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన విచారణను ముగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!