
బిజినెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా పట్టణ నియోజకవర్గాల్లో చిరునామాల్లో లేని ఓటర్లను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. వారిని వెతికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించడం కోసం బీఎల్వోలు అదనపు శ్రమ పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రోజుకు 300 ఇళ్లను సందర్శించాలని లక్ష్యాలు విధించడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో మ్యాపింగ్ కాని ఓట్లు లక్షల్లో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. తమకు అదనపు సిబ్బంది, సహాయకులను నియమించాలని బీఎల్వోలు డిమాండ్ చేస్తున్నారు. కనీస గౌరవ వేతనం కూడా అందడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!