

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘వారణాసి’ చిత్రబృందం కూడా సెలబ్రేషన్స్‌లో భాగంగా మహేశ్ బాబు నటించిన రెండు ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేసింది. మరోవైపు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆరోగ్యం, ఆనందంతో మహేశ్‌కు అద్భుతమైన ఏడాది కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.
ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో సుమారు 15 శాతం మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత కొంత విరామం తీసుకుని తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!